మద్నూర్‌లో తల్లి పాల వారోత్సవాలు..ముర్రుపాల ప్రాముఖ్యతపై అవగాహన
మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 7వ అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లి తన బిడ్డకు ఇచ్చే తొలి అమూల్యమైన బహుమతి తల్లిపాలేనని అధికారులు వివరించారు. ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని, ఇతర ఆహారం ఇవ్వకూడదని తల్లులకు అవగాహన కల్పించారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ […]
మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 7వ అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లి తన బిడ్డకు ఇచ్చే తొలి అమూల్యమైన బహుమతి తల్లిపాలేనని అధికారులు వివరించారు. ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని, ఇతర ఆహారం ఇవ్వకూడదని తల్లులకు అవగాహన కల్పించారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దేవకరుణ, గ్రామ సర్పంచ్ ఉష సంతోష్, వార్డ్ మెంబర్ చంద్రవ్వ, మాజీ ఎంపీటీసీ సంగీత కుశల్, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.





