పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కల నాటడం..వన మహోత్సవానికి శ్రీకారం
వన మహోత్సవంలో భాగంగా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలో 200 ఈత మొక్కలను నాటారు. బిచ్కుంద ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో గౌడ సంఘం, గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి ఈఎస్ ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆబ్కారీ ఎస్‌ఐ నాగేష్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈత వనాలను పెంచాలనే మంచి సంకల్పంతో ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ […]
వన మహోత్సవంలో భాగంగా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలో 200 ఈత మొక్కలను నాటారు. బిచ్కుంద ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో గౌడ సంఘం, గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి ఈఎస్ ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆబ్కారీ ఎస్‌ఐ నాగేష్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈత వనాలను పెంచాలనే మంచి సంకల్పంతో ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గౌడ సంఘం నాయకులు, గ్రామస్తులు సహకరించారు.
కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ సిబ్బంది దేవి సింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.





