బ్రేకింగ్
జుక్కల్ 161వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతికౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తే అవకాశం!పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కల నాటడం..వన మహోత్సవానికి శ్రీకారంవరలక్ష్మీ పూజలతో ఆధ్యాత్మిక శోభ.. మద్నూర్‌లో భక్తుల సందడిజుక్కల్ మండలంలో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్
మద్నూర్ బాలికల వసతి గృహంలో ఆరోగ్య శిబిరం
మద్నూర్

మద్నూర్ బాలికల వసతి గృహంలో ఆరోగ్య శిబిరం

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలికల వసతి గృహంలో విద్యార్థినుల కోసం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై వైద్య సిబ్బంది పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ గంగాసుధా మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు తమ ఆరోగ్యంపైనా సమానంగా శ్రద్ధ చూపాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే చదువులో మంచి ఫలితాలు సాధించగలరని ఆమె పేర్కొన్నారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని, […]

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలికల వసతి గృహంలో విద్యార్థినుల కోసం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై వైద్య సిబ్బంది పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ గంగాసుధా మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు తమ ఆరోగ్యంపైనా సమానంగా శ్రద్ధ చూపాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే చదువులో మంచి ఫలితాలు సాధించగలరని ఆమె పేర్కొన్నారు.
అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని, పరిశుభ్రత పాటించడం, సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఈ ఆరోగ్య శిబిరంలో పలువురు విద్యార్థినులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటువంటి ఆరోగ్య శిబిరాలు తరచూ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.