జుక్కల్ మండలంలో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్
అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు జుక్కల్ మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి (ఈఎస్) ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జుక్కల్ ఆబ్కారీ ఎస్.ఐ నాగేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ మండలంలో పలు గ్రామాల్లో కల్లు దుకాణాలు, దాబా హోటళ్లు, కోళ్లఫారాలు, వైన్స్ ల్లో […]
అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు జుక్కల్ మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి (ఈఎస్) ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జుక్కల్ ఆబ్కారీ ఎస్.ఐ నాగేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ మండలంలో పలు గ్రామాల్లో కల్లు దుకాణాలు, దాబా హోటళ్లు, కోళ్లఫారాలు, వైన్స్ ల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. కల్లు దుకాణాల్లో కల్లు నమూనాలను (శాంపిళ్లు) సేకరించి పరీక్షల కోసం పంపినట్లు ఆయన వెల్లడించారు. దాబా హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నారా అనే అంశంపై ఆరా తీశారు. కోళ్లఫారాలలో తనిఖీ చేసి మాదకద్రవ్యాలకు సంబంధించిన వస్తువులు లేదా ఇతర అనుమానాస్పద పదార్థాలు నిల్వ చేశారా అనే విషయాన్ని పరిశీలించినట్లు తెలిపారు.పలు గ్రామాల సరిహద్దుల వద్ద ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అక్రమ మద్యం, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని నాగేష్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఆబ్కారీ సిబ్బంది దేవిసింగ్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.





