బ్రేకింగ్
జుక్కల్ 161వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతికౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తే అవకాశం!పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కల నాటడం..వన మహోత్సవానికి శ్రీకారంవరలక్ష్మీ పూజలతో ఆధ్యాత్మిక శోభ.. మద్నూర్‌లో భక్తుల సందడిజుక్కల్ మండలంలో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్
కౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తే అవకాశం!
జుక్కల్

కౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తే అవకాశం!

జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 457.60 మీటర్లు ఉండగా, గరిష్ట నిల్వ మట్టం 458 మీటర్లు. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగితే నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. అవసరమైతే ప్రాజెక్టు గేట్లు ఎత్తి అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నది, వరద […]

జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 457.60 మీటర్లు ఉండగా, గరిష్ట నిల్వ మట్టం 458 మీటర్లు. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగితే నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. అవసరమైతే ప్రాజెక్టు గేట్లు ఎత్తి అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నది, వరద కాలువల వైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పశువులు, గొర్రెలను కూడా అటువైపు వెళ్లకుండా చూడాలని సూచించారు. గేట్లు ఎత్తే ముందు ప్రత్యేక హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు.