బ్రేకింగ్
జుక్కల్ 161వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతికౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తే అవకాశం!పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కల నాటడం..వన మహోత్సవానికి శ్రీకారంవరలక్ష్మీ పూజలతో ఆధ్యాత్మిక శోభ.. మద్నూర్‌లో భక్తుల సందడిజుక్కల్ మండలంలో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్
సంఘాలను బలోపేతం చేయండి….
జుక్కల్

సంఘాలను బలోపేతం చేయండి….

*సంఘాలను బలోపేతం చేయండి….* -అడిషనల్ డీ.ఆర్.డి.వో విజయలక్ష్మి   మద్నూర్ మండల సమాఖ్య (ఐకేపీ) కార్యాలయంలో మద్నూర్, బిచ్కుంద మండలాల ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.   ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ డి.ఆర్.డి.ఓ విజయలక్ష్మి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు..   మండలంలో సంఘంలో నుండి వెళ్లిపోయిన 60 సంవత్సరాల మహిళలతో వృద్ధుల సంఘాలు , అలాగే దివ్యాంగుల సంఘాలను , కిషోర బాలికల సంఘాలను తయారు చేసి ఆన్లైన్ […]

*సంఘాలను బలోపేతం చేయండి….*

-అడిషనల్ డీ.ఆర్.డి.వో విజయలక్ష్మి

 

మద్నూర్ మండల సమాఖ్య (ఐకేపీ) కార్యాలయంలో మద్నూర్, బిచ్కుంద మండలాల ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

 

ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ డి.ఆర్.డి.ఓ విజయలక్ష్మి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు..

 

మండలంలో సంఘంలో నుండి వెళ్లిపోయిన 60 సంవత్సరాల మహిళలతో వృద్ధుల సంఘాలు , అలాగే దివ్యాంగుల సంఘాలను , కిషోర బాలికల సంఘాలను తయారు చేసి ఆన్లైన్ లో వివరాలు ఎంట్రీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లోని అందరూ మహిళలు ఏదో ఒక సంఘం లో ఉండాలని చెప్పారు.

 

ఈ ఆర్థిక సంవత్సరంలో (2026-27) బ్యాంక్ లోన్ మరియు స్త్రీ నిధి లోన్ లు నిర్దేశించిన లక్ష్యంలో 100% చేరుకోవాలని చెప్పారు.

 

అలాగే బకాయి పడ్డ వారివద్ద నుండి రికవరీ చేయాలని చెప్పడం జరిగింది.

 

బకాయి పడ్డ వారిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కుటుంబ సభ్యులు ఉంటే వారి వివరాలు తయారుచేసి జిల్లా కేంద్రానికి పంపాలని ఆదేశించారు.

 

తీసుకున్న రుణాలను సద్వినియోగం అయ్యేలా చూడాలి. వారికి రోజూ ఆదాయం వచ్చేలా యాక్టివిటీ పెట్టించాలని చెప్పడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో రెండు మండలాల ఐకేపీ సిబ్బంది, ఏపీయం జగదీష్ కుమార్ , రవీందర్ లు పాల్గొన్నారు.