బ్రేకింగ్
మద్నూర్‌ను నిజామాబాద్‌లో కలపాలంటూ డిమాండ్..కలెక్టర్ నుంచి సర్కులర్!డోంగ్లి మండల వ్యాప్తంగా పోషణమాసంమద్నూర్ పోషణమాసం ప్రారంభండీజేకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇప్పించారు పోలీసులు..జుక్కల్ 161వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతికౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తే అవకాశం!
మద్నూర్‌ను నిజామాబాద్‌లో కలపాలంటూ డిమాండ్..కలెక్టర్ నుంచి సర్కులర్!
పెద్ద కొడప్ గల్

మద్నూర్‌ను నిజామాబాద్‌లో కలపాలంటూ డిమాండ్..కలెక్టర్ నుంచి సర్కులర్!

మద్నూర్ మండలాన్ని తిరిగి నిజామాబాద్ జిల్లాలో కలపాలంటూ మద్నూర్ ప్రజలు మరోసారి గళం విప్పారు. ఆగస్టు 24న శివాజీ అప్ప ఆధ్వర్యంలో సుమారు 20 మంది ప్రజలు మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మద్నూర్ నుంచి పాత నిజామాబాద్ జిల్లా కేంద్రం సుమారు 75 కిలోమీటర్లు ఉండగా.. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రం సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రజలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మార్పు అంశంపై ప్రజల కోరికను […]

మద్నూర్ మండలాన్ని తిరిగి నిజామాబాద్ జిల్లాలో కలపాలంటూ మద్నూర్ ప్రజలు మరోసారి గళం విప్పారు.
ఆగస్టు 24న శివాజీ అప్ప ఆధ్వర్యంలో సుమారు 20 మంది ప్రజలు మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మద్నూర్ నుంచి పాత నిజామాబాద్ జిల్లా కేంద్రం సుమారు 75 కిలోమీటర్లు ఉండగా.. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రం సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రజలు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా మార్పు అంశంపై ప్రజల కోరికను పరిశీలిస్తూ నివేదిక ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి సంబంధిత అధికారులకు సర్కులర్ జారీ అయినట్లు సమాచారం. ఇప్పుడు మద్నూర్ జిల్లా మార్పుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.