జుక్కల్ 161వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతి
కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుక్కల్ మండలంలోని కౌలాస్ చౌరస్తా సమీపంలో 161వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఆంజనేయులు సీటు కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. కండక్టర్‌కు తీవ్ర గాయాలు కావడంతో మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని […]
కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
జుక్కల్ మండలంలోని కౌలాస్ చౌరస్తా సమీపంలో 161వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఆంజనేయులు సీటు కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. కండక్టర్‌కు తీవ్ర గాయాలు కావడంతో మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి ముందు సుమారు 200 మీటర్ల దూరం నుంచే బస్సు అదుపుతప్పి వంకరగా వెళ్తుండటంతో ప్రయాణికులు భయంతో కేకలు వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఘటన స్థలానికి బయలుదేరారు సంబంధిత అధికారులు మంత్రితో ఫోన్లో మాట్లాడారు.





